12 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్
- March 04, 2019
అబుదాబీ బిగ్ టికెట్ రాఫెల్ లో 12 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్నారు భారతదేశానికి చెందిన రాగీ జార్జ్. కేరళలోని అలప్పుజాకి చెందిన రాగీ జార్జ్, కువైట్‌లో నివసిస్తున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాఫెల్ ను నిర్వహించిన రిచార్డ్ ఈ విషయాన్ని చెప్పగానే, రాగీ జార్జ్ అస్సలేమాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోయారట. ఈ ఏడాది వరుసగా రెండు నెలల్లోనూ కేరళకు చెందినవారే మెగా ప్రైజ్‌ని గెలుస్తూ వస్తున్నారు. కాగా, తాను 12 ఏళ్ళ నుంచీ కువైట్‌లో నివసిస్తున్నాననీ, తన కుమార్తె 10వ గ్రేడ్ చదువుతోందనీ, మరో ఏడాది రెండేళ్ళలో ఇండియాకి వెళదామనుకున్నామనీ జార్జ్ చెప్పారు. ఓ ప్రైవేటు సంస్థలో పర్చేజ్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్గా జార్జ్ విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







