అభినందన్ బయోపిక్!
- March 05, 2019
అభినందన్ వర్ధమాన్.. భారత్ లో ఇప్పుడొక రియల్ హీరో... శత్రు సైన్యానికి చిక్కినా అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించిన ధీరుడు... దేశ రక్షణ రహస్యాలను కాపాడిన వీర జవాన్. భారత వాయుసేన వింగ్ కమాండర్ అయిన అభినందన్ వర్ధమాన్.. పాక్ సైన్యం కస్టడీలో దాదాపు రెండున్నర రోజులు గడిపినా చెదరని స్థైర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు.
ఈ క్రమంలో అభినందన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ లో దిగ్గజ ఫిలింమేకర్ గా పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రముఖ ఆడియో సంస్థ టీ-సిరీస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
అభినందన్ బయోపిక్ కు అభిషేక్ కపూర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అయితే... అభినందన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్న దానిపై విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి బాలీవుడ్ హంక్... జాన్ అబ్రహాం... అభినందన్ పాత్రపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. దర్శక నిర్మాతలు అబ్రహాంకే ఛాన్స్ ఇస్తారా... లేదంటే.. మరెవరినైనా ఎంపిక చేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్‌పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









