నూతన సంవత్సరం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు
- December 29, 2015
నూతన సంవత్సరం సందర్భంగా దేశంలో లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో పలుచోట్ల ఉగ్రవాదులు దాడులకు యత్నించే అవకాశం ఉందని... నూతన సంవత్సర వేడుకలను ఇందుకు వేదిక చేసుకోనున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని... అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించాయి. పాక్ నుంచి 1520 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని... ముంబయి తరహా దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలతో పాటు సైనిక, అణు సంబంధిత ప్రాంతాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భద్రతను కట్టుదిట్టం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







