బాబు భద్రతకు మాత్రం బోలెడెంత ఖర్చు..
- December 29, 2015
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భద్రతాపరమైన ప్రమాదం కొత్త విషయం కాదు. 2003లో తిరుపతిలోని అలిపిరి వద్ద మావోయిస్టులు జరిపిన బాంబుదాడిలో తృటిలో తప్పించుకున్న చంద్రబాబు ప్రస్తుతం జెడ్ కేటగిరీ భద్రతా వలయంలో ఉంటున్నారు. పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉంటూ హైదరాబాద్‌కు, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకూ మధ్య తరచుగా ప్రయాణించవలసి వస్తున్న చంద్రబాబుకు భద్రత కల్పించడం ఆయన సిబ్బందికి చాలా కష్టంగా తయారయింది.ఈ నేపథ్యంలో ఆయనకోసం ప్రత్యేక కాన్వాయ్‌ని ఏర్పర్చారు. ఈ వాహనాల బారులో భద్రతను బలోపేతం చేయడానికి అధికారులు అధునాతన జామర్‍ని కొనుగోలు చేశారు. ఈ ఒక్క జామర్‌కే ప్రభుత్వ ఖజానా నుంచి 1.5 కోట్ల రూపాయలను చెల్లించారు.ఆయన భద్రత కోసమని, సురక్షిత ప్రయాణం కోసమని గత సంవత్సరమే 5 కోట్లకు పైగా వెచ్చించి ప్రత్యేక బస్సును కొనుగోలు చేసారు. కానీ ఈ మద్య విమాన ప్రయాణాలే ఎక్కువ కావడంతో చంద్రబాబుకు ఆ బస్సును వినియోగించే అవసరం పెద్దగా లేకపోవడంతో అది మూలన బడింది. కొత్తగా కొనుగోలు చేసిన ప్రత్యేక జామర్ విశేషమేమిటంటే రిమోట్ కంట్రోల్ ద్వారా దూరం నుంచి పేల్చగల బాంబులను కూడా ఈ అత్యాధునిక పరికరం నిర్వీర్యం చేస్తుంది. చంద్రబాబు గత 20 ఏళ్లుగా మావోయిస్టుల హిట్ లిస్టులో ఉంటున్నరు. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ మినహా ఏపీ మొత్తంలో మావోయిస్టు పార్టీ ఉనికిలో లేదు. కానీ మావోయిస్టుల నుంచి ప్రమాదం పేరుతో బాబు భద్రతకు మాత్రం బోలెడెంత ఖర్చు పెరిగిపోతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







