వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్‌ల యూజర్లను బ్యాన్ చేసిన వాట్సాప్
- March 12, 2019
వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్‌ల యూజర్లను బ్యాన్ చేస్తునట్లు ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులు, భద్రతా కారణాల దృష్ట్యా ఆ వాట్సాప్‌లను వినియోగిస్తున్న యూజర్లను నిషేధించినట్లు వెల్లడించింది. ఈ అనుబంధ యాప్‌లను థర్డ్‌పార్టీ డెవలపర్లు తయారు చేశారు. అయితే, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అధికారిక వాట్సాప్ నియమ నిబంధనలను, సేవలను అతిక్రమించడంతో ఈ చర్యలకు దిగినట్లు వాట్సాప్ పేర్కొంది. వినియోగదారులందరూ అధికారిక వాట్సాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆ వెర్షన్లను వినియోగిస్తున్న వారు అధికారిక వాట్సాప్‌నకు ఎలా మారాలో కూడా సూచనలు చేసింది.
''మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడింది' అని మీ వాట్సాప్‌నకు సందేశం వస్తే, మీరు అఫిషియల్ వాట్సాప్‌ను కాకుండా థర్డ్ పార్టీ తయారు చేసిన వాట్సాప్‌ను వినియోగిస్తున్నట్లు అర్థం. వాట్సాప్‌ను వినియోగించడానికి అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే'' అని సంస్థ తెలిపింది. అదే సమయంలో ఇప్పటి వరకూ మీ స్నేహితులతో కొనసాగించని సంభాషణలన్నీ అఫిషియల్ వాట్సాప్‌కు బదిలీ చేసే విషయంలో గ్యారెంటీ ఇవ్వలేమని తెలిపింది. ఎందుకంటే అనధికార యాప్స్‌కు తాము మద్దతు తెలపమని స్పష్టం చేసింది.
మీరు ఏ వాట్సాప్ వాడుతున్నారో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!
* Open your app.
* Go to 'More Options' GO
* Go to 'Settings'
* Tap on Help
* name from App info.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







