హైదరాబాద్:మరో హవాలా రాకెట్ గుట్టురట్టు
- March 12, 2019
హైదరాబాద్ లో మరో హవాలా రాకెట్ గుట్టురట్టయింది. ఈరాకెట్ ను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. కాచిగూడ, సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈహవాలా సాగుతున్నట్లు గుర్తించారు. నలుగురు వ్యాపారుల నుంచి 90 లక్షల 50వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ దృష్యా వాహనాలను తనిఖీలు చేస్తుండగా..ఈ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ నలుగురు సభ్యులు వేర్వేరుగా బస్సుల్లో నగదు తరలింస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . హవాల రూపంలో నగదున తరలిస్తున్న దేవేష్ కొటారి అనే వ్యక్తి వద్ద 50 లక్షలు స్వాధీనం చేసుకోగా.. భక్తిప్రజాపతి వద్ద 23 లక్షలు, నసీమ్ వద్ద 5 లక్షల 70 వేలు, విశాల్ జైన్ వద్ద 11 లక్షల 80 వేలుస్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నలుగురు సభ్యులు వేర్వేరుగా బస్సుల్లో నగదు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా నిందితులు చూపించలేదని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. వీరు గత కొంత కాలంగా వేర్వేరుగా హవాలా వ్యాపారం నిర్వహిస్తూ డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి వద్ద నుంచి మూడు క్యాష్ కౌంటింగ్ యంత్రాలతోపాటు నాలుగు ద్విచక్రవాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ప్రజలు 50వేల రూపాయలకు మించి ఎక్కువ వెంట ఉంచుకోవద్దని.. అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటే దానికి తగిన ఆధారాలు చూపాలని చెప్పారు. గత ఎన్నికల్లో రూ. 29 కోట్ల నగదు, 3 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..