న్యూజిలాండ్‌ టెర్రర్‌ ఎటాక్‌ని ఖండించిన ఒమన్‌

- March 16, 2019 , by Maagulf
న్యూజిలాండ్‌ టెర్రర్‌ ఎటాక్‌ని ఖండించిన ఒమన్‌

మస్కట్‌: న్యూజిలాండ్‌లో జరిగిన తీవ్రవాద ఘటనను ఒమన్‌ తీవ్రంగా ఖండించింది. న్యూజిలాండ్‌లోగల క్రైస్ట్‌ చర్చ్‌లో రెండు మాస్క్‌లపై దుండుగులు దాడి చేసి, 49 మందికి పైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాగా, సుల్తానేట్‌ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఒమన్‌, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని తుదముట్టించాల్సిందేనని ఒమన్‌ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com