భవనం పైనుంచి పడి చిన్నారి

- March 16, 2019 , by Maagulf
భవనం పైనుంచి పడి చిన్నారి

కల్బాలోని ఓ అపార్ట్‌మెంట్‌ పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది ఓ చిన్నారి. అపార్ట్‌మెంట్‌ విండో లోంచి చిన్నారి కింది పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కల్బా పోలీస్‌ స్టేషన్‌కి సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఫుజారియా పోలీసుల ద్వారా అందింది. చిన్నారిని తొలుత కల్బా హాస్పిటల్‌కి తరలించారు, ఆ తర్వాత ఆమెను ఫుజారియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. విండో దగ్గరకు చేరుకున్న చిన్నారి, ఆ విండో పైకెక్కి కిందకు పడిపోయిందనీ, ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెను గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఈ నిర్లక్ష్యానికిగాను తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com