'ప్యానిక్ అలర్ట్' మొబైల్లోని '9' నెంబర్
- December 29, 2015
ఆపత్కాలంలో మహిళలను సత్వరమే ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ముందడుగు వేస్తోంది. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు మొబైల్లోని ఒక్క డిజిట్ (అంకె) గట్టిగా నొక్కినా చాలు పోలీసులకు, తమ సన్నిహితులకు 'ప్యానిక్ అలర్ట్' వెళ్లేవిధంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్ మొబైల్లోని '9' నెంబర్‌ను గట్టిగా నొక్కడం ద్వారా ఎస్‌వోఎస్ సందేశం పోలీసులతోపాటు మరో తొమ్మిదిమంది ఎంచుకున్న వ్యక్తులకు వెళుతుంది. ఈ సందేశంలో యూజర్ ఉన్న ప్రదేశం వివరాలు కూడా ఉంటాయి.స్మార్ట్‌ఫోన్‌లో ఈ సర్వీసు అలర్ట్ చాలా ప్రభావంతంగా పనిచేసే అవకాశముంది. అదేవిధంగా మాములు ఫోన్లలోనూ ఈ సర్వీసు అప్‌గ్రేడ్ చేసే వీలుంది.సాధారణ ఫోన్లలో ఉచితంగా ఈ సర్వీసును అప్‌గ్రేడ్ చేసేందుకు మొబైల్ ఫోన్ తయారీదారులు, టెలిఫోన్ సర్వీసు ప్రోవైడర్లు ముందుకొచ్చారని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'ప్రతి మొబైల్‌ఫోన్‌లోనూ ఈ సర్వీసు పనిచేస్తుంది. మొబైల్లో ఒక అదనపు బటన్ పెట్టుకోవడం లేదా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం కంటే మొబైల్ ఫోన్లోని ప్రస్తుత పొగ్రామ్‌ను అప్‌గ్రేడ్ చేసుకొని ఈ నూతన సర్వీసును వాడటం మంచింది' అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ఈ మేరకు నూతన సేవలు అందించాలంటూ కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ త్వరలోనే టెలికం ప్రొవైడర్లకు అధికారిక ఆదేశాలు ఇచ్చే అవకాశముంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







