సముద్రంలో రెస్టారెంట్..
- March 26, 2019
నార్వే:జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే హలా.. అని పాడుకుంటూ విందారగించవచ్చు. మనకి తెలిసి పెద్ద పెద్ద బోట్లలో రెస్టారెంట్లు అందులోనే ఉంటాయి. చుట్టూ ఉన్న సముద్ర అందాల్ని చూస్తూ చవులూరించే విందు భోజనాన్ని లాగించేస్తుంటారు భోజన ప్రియులు.
అయితే మరి కాస్త వెరైటీని కోరుకునే ప్రకృతి ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని నార్వే ప్రభుత్వం ఏకంగా సముద్రంలోనే ఓ రెస్టారెంట్ పెట్టి వండి వారుస్తోంది. సరిగ్గా వారం రోజుల క్రితమే ఈ రెస్టారెంట్ జనులకు అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా సముద్రంలో కాకుండా ఓ వైపు బయటి ప్రపంచం కనిపించేలా, మరోవైపు సముద్రంలోపలి దృశ్యాలు కనిపించేలా ఈ రెస్టారెంట్‌ని నిర్మించారు.
నార్వేలోని నార్త్ సీని లింక్ చేస్తూ కాంక్రీట్ ట్యూబ్ నిర్మించారు. నార్వేకు చెందిన నిర్మాణ సంస్థ స్నోహెట్టా ఈ రెస్టారెంట్ నిర్మాణాన్ని చేపట్టింది. సముద్ర ఉపరితలానికి 16 అడుగుల లోపల దీన్ని నిర్మించారు. ఒకేసారి 40 మంది కూర్చుని భోజనం చేసేవిధంగా ఇందులో టేబుల్స్ ఎరేంజ్ చేశారు. వేడి వేడి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ ఎగిరి పడుతున్న చేపల్ని, చిన్న చిన్న సముద్ర జీవుల్నీ చూస్తూ హాపీగా గడిపేయొచ్చు.
ఇక ఈ రెస్టారెంట్‌లో వండి వడ్డించే పదార్థాలు కూడా సముద్ర వంటకాలే కావడం విశేషం. ప్లేట్ మీల్స్ ఎంతని మాత్రం అడక్కండి.. జస్ట్ 380 యూరోలు.. అంటే మన కరెన్సీలో రూ.30వేలు మాత్రమే. మరి ఒక్కసారన్నా వెళ్లాలని అనిపించడం లేదూ. రెస్టారెంట్‌లో భోజనం ఒక్కటే కాదు.. ఆసక్తి వుంటే మెరైన్ బయాలజీపై అధ్యయనం కూడా చేయవచ్చు. అందుక్కావలసిన టూల్స్ అన్నీ వారే సమకూరుస్తారట. రెస్టారెంట్ ఓపెన్ చేసి వారం రోజులు కూడా కాలేదు.. అప్పుడే 7 వేల మంది టేబుల్ బుక్ చేసుకున్నారట.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







