నీతా అంబానీ చేసిన పని చూసారా!!

- March 27, 2019 , by Maagulf
నీతా అంబానీ చేసిన పని చూసారా!!

ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసిన అంబానీలు కోడలికి ఇచ్చిన కానుక విషయంలోనూ తమ రేంజ్ చూపించుకున్నారు. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన కోడలికి అత్త నీతా అంబానీ అదిరిపోయే బహుమతితో స్వాగతం చెప్పారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ ఎవరికి ఇవ్వనంత విలువైన కానుక ఇచ్చారు.

రూ.300కోట్ల విలువైన నగ
మార్చి 9 ముఖేష్, నీతా అంబానీల పెద్ద కొడుకు ఆకాశ్, అతని చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు వివాహం జరిగింది. మెట్టినింట అడుగుపెట్టిన శ్లోకాకు నీతా అంబానీ పెళ్లి కానుకగా డైమెండ్ నెక్లెస్ ప్రెజెంట్ చేశారు. నీతా మొదట తమ కుటుంబంలో వారసత్వంగా వస్తున్న బంగారు హారాన్ని పెళ్లిలోనే కోడలికి కానుకగా ఇవ్వాలనుకున్నారట. కానీ మనసు మార్చుకుని తన పెద్ద కోడలికి ప్రపంచంలోనే అత్యంత విలువైన నగ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించిన నీతా అంబానీ, దాన్ని శ్లోకా మెడలో అలంకరించి మురిసిపోయారు.

ప్రేమకు గుర్తుగా బంగారుపూత కారు
శ్లోకాకు అత్తింటి నుంచి ఇంత విలువైన కానుక అందడం ఇదే మొదటిసారి కాదు. పెళ్లి నిశ్చయమైన తర్వాత ఆకాశ్ తమ ప్రేమకు గుర్తుగా శ్లోకాకు జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చాడు. బంగారు పూతతో ప్రత్యేకంగా తయారుచేయించిన ఏడు కోట్ల రూపాయల విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com