రాష్ట్రంలో మార్చి చివరి నాటికి 2 లక్షల గృహాలు..
- December 30, 2015
రాష్ట్రంలో మార్చి చివరి నాటికి 2 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన చైైర్మన వర్ల రామయ్య అన్నారు. బుధవారం మార్కెట్‌యార్డు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నుంచి పట్టణాలకు 1 లక్షా 93 వేల గృహాలు మంజూరయ్యాయన్నారు. ఇదంతా చంద్రబా బునాయుడు కృషేనన్నారు. రానున్న 3 సంవత్స రాలలో మరో 10 లక్షల గృహాలు నిర్మించే అవకా శం ఉందన్నారు. పేదలందరికి పక్కా గృహాలు నిర్మించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహా నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబా బునాయు డు అడుగడుగున పర్యవేక్షిస్తారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గృహాల నిర్మాణానికి బడ్జెట్‌ను పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కు తుందన్నారు. ఒక్కొక్క గృహ నిర్మాణానికి రూ. 2 లక్షల 75 వేలు మంజూరు చేయటం జరుగు తుందన్నారు. ఎస్సీ లకు మరుగుదొడ్డి నిర్మాణ నిమిత్తం అదనంగా మరో రూ.15 వేలు మంజూ రు చేస్తామన్నారు. పేదవాడి ఎదుగుదలను టీడీపీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. పూరిల్లు లేని సమాజం చూడాలన్నదే చంద్రబాబునా యుడు లక్ష్యమన్నారు. సీఎం మహా యజ్ఞంలో సమిధలులా పని చేసే అవకాశం తమకు కల్పించారన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మె ల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మున్సిపల్ చైైైర్మన యెల్లినేడి రామస్వామి, ఎంపీపీ బొర్రా కోటేశ్వ రరావు, మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైైర్మన మక్కపాటి రామచంద్రరావు, ముసునూరి శేఖ ర్‌బాబు, ముప్పాళ్ళ ఎంపీపీ ఉమాదేవి, తెలు గు మహిళా నాయకురాలు భీమినేని వంద నా దేవి, దేశం నాయకులు బత్తుల చంద్రశేఖర్, వ క్కంటి అజయ్, అంకాళ్ళ ప్రభుదాసు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







