వాహనదారులకు డీలర్లు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలి--జీవీ రాజరత్నం
- December 30, 2015
నూతనంగా ద్విచక్రవాహనం కొనుగోలు చేసిన వాహనదారులకు డీలర్లు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలని డీటీసీ జీవీ రాజరత్నం ఆదేశించారు. గుంటూరులోని పలు షోరూంలలో డీటీసీ బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ఇవ్వకుండా వాహనం విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాహన డీలర్లు వాహనంతో పాటు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాల్సిందేనన్నారు. వాహన కొనుగోలుదారులు కూడా హెల్మెట్‌ను అడిగి తీసుకోవాలన్నారు. డీలర్లు వాహనానికి తాత్కాలిక రిజిస్ర్టేషేన చేసిన వెంటనే కొనుగోలుదారు చేతికి అం దించాలన్నారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా డీలర్ షిప్ రద్దుచేయడం జరుగుతుందన్నారు. నగరంలో ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన రెండు షోరూంలకు నోటీసులు అందించామన్నారు. వాహనం కొన్నారా.. అయితే హెల్మెట్ బిల్లు తీసుకోండి వాహనం కొనుగోలు చేసిన సమయంలో వినియోగదారులు హెల్మెట్ బిల్లును విధిగా అడిగి తీసుకోవాలి. లేకుంటే రిజిసే్ట్రషన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









