హైదరాబాద్:డ్రోన్ పైలెట్లకు శిక్షణ..
- April 09, 2019
హైదరాబాద్:గత మూడు నాలుగు సంవత్సరాలనుంచి డ్రోన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల గురించి తరచుగా వింటూ ఉన్నాము. ఇప్పటి వరకు అంతగా వినియోగంలో లేని డ్రోన్ కెమెరాల వాడకానికి అధికారిక ఆమోదం లభించడంతో ఊపందుకుంది. హైదరాబాదుకు చెందిన ఐటీ సంస్థ ‘సైయెంట్’ నగరంలో రిమోట్ పైలట్ (డ్రోన్ పైలట్) శిక్షణను ఇవ్వనుంది. ఇందుకు గాను ఆ సంస్థ సోమవారం తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ), తెలంగాణ ప్రభుత్వంతో కలిసి త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలట్ల శిక్షణకు అవసరమైన పరికరాలను, సిమిలేషన్ సౌకర్యాలను ఐటీ సంస్థ ‘సైయెంట్’ అందించనుంది. టీఎస్‌ఏఏ సంస్థ ఇందుకు అవసరమైన మౌలిక వసతులను, శిక్షణ సేవలను అందించనుంది. శిక్షణకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులైన డ్రోన్ పైలట్లను తయారు చేయడమే ధ్యేయంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వివిధ రకాల రోటరీ, ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్ల గురించి సిమిలేటర్లపై శిక్షణ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







