హెల్త్ సెంటర్‌పై మానసిక రోగి దాడి
- April 12, 2019
బహ్రెయిన్:మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి, హెల్త్ సెంటర్ స్టాఫ్ మెంబర్‌పై దాడికి దిగిన ఘటన హూరా హెల్త్ సెంటర్‌లో జరిగింది. ఈ ఘటనతో హెల్త్ సెంటర్‌ని తాత్కాలికంగా మూసివేశారు. నిందితుడు, హెల్త్ సెంటర్‌లోని విలువైన ఎక్విప్‌మెంట్‌ని ధ్వంసం చేయడం జరిగింది. రిసెప్షన్ ఏరియాకి వెళుతూనే ఆగ్రహావేశాలతో ఊగిపోయిన నిందితుడు, అక్కడున్న వస్తువుల్ని ధ్వంసం చేయడం మొదలు పెట్టాడనీ, ఆ తర్వాత స్టాఫ్ మీద దాడికి దిగాడని తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది నిందితుడ్ని నిలువరించేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అధికారులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడైన మానసిక రోగిని సైకియాట్రిక్ హాస్పిటల్‌కి తరలించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







