చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా గోల్డ్ స్వాధీనం

- April 12, 2019 , by Maagulf
చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా గోల్డ్ స్వాధీనం

చెన్నై:చెన్నైలో 3.50 కిలోల బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో 13 మందిని పట్టుకుని వీరి వద్దనుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు ఘటనల్లో బంగారం పట్టుబడింది. దీని విలువ కోటి 15 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు యువకులు ఏప్రిల్ 12వ తేదీ గురువారం రాత్రి దుబాయ్ నుండి చెన్నైకి వచ్చారు. వీరిని ఎయిర్ పోర్టు అధికారులు తనిఖీలు చేయగా అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. 900 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

కొలంబో నుండి చెన్నైకి వచ్చిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా 1.26 కిలోల బంగారం బయటపడింది. నైరోబీ నుండి వచ్చిన ఇద్దరు యువకులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా లో దుస్తుల్లో బంగారం ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 3.50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com