డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు..
- April 12, 2019
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు. జూన్ మొదటి వారంలో ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు రెండో వారంలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
పోస్టుల వివరాలు..
జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్): 8904 పోస్టులు
తెలంగాణలో 425
ఏపీలో 253
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.04.1991 – 01.04.1999 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వుంటుంది.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750.. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.25 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.05.2019
దరఖాస్తుల ఎడిట్‌కు చివరి తేదీ: 03.05.2019
దరఖాస్తులు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 18.05.2019
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 12.04.2019 – 03.05.2019
ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌లో
మెయిన్ పరీక్ష: 10.08.2019
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







