దుబాయ్ ఎయిర్ పోర్ట్ రన్ వే మూసివేత: నమోదు కాని 'ఆలస్యం'
- April 17, 2019
దుబాయ్:డిలేస్, డిస్‌రప్షన్స్ లేకుండా ఎమిరేట్స్ విమానాల్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)కి ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సదరన్ రన్ వే అభివృద్ధి పనుల్లో భాగంగా 45 రోజులపాటు మూసివేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తొలి రోజు పెద్దగా అవాంతరాలు ఏమీ కనిపించలేదు. మే 30 వరకు ఈ రన్‌వేని మూసివేస్తారు. ఈ కాలంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్ళాల్సిన కొన్ని విమానాల్ని డిబ్ల్యుసి లేదా షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నిర్వహిస్తారు. ముందస్తు ప్లానింగ్‌తో 'ఆలస్యాల్ని' నివారించగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకుల్ని ముందస్తుగానే అప్రమత్తం చేయడంతో వారి సహకారం కారణంగా పని మరింత సులవవుతోందని వారు చెబుతున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డబ్ల్యుసి 65 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఉచిత సర్వీస్ షటిల్స్‌ని ప్రతి 30 నిమిషాలకు ఏర్పాటు చేస్తున్నారు. డెడికేటెడ్ ఫ్లీట్ ఆఫ్ ట్యాక్సీలు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







