స్థలం మీది.. ప్లాన్ మాది: మే 1 నుంచి GHMC..
- April 19, 2019
హైదరాబాద్:గ్రేటర్ హైదరబాద్‌లోని 500 చ.గ విస్తీర్ణంలోపు స్థలాలకు ఇంటి ప్లాన్ ఉచితంగా అందిస్తామంటోంది జీహెచ్‌ఎంసీ. ఇందుకు సంబంధించిన 2 వేల ఇంటి నమూనాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. మే1 నుంచి ఈ ప్లాన్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలోనే దరఖాస్తు దారులు తమకు నచ్చిన నమూనాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వివరించారు. ఇంటి అనుమతుల ప్రక్రియ అవినీతికి ఆస్కారం లేకుండా జరపాలన్నారు. నగరంలో ఏటా 17 వేల ఇంటి నిర్మాణాలు మంజూరవుతున్నాయని అందులో 80 శాతం 500 గజాల్లోపు విస్తీర్ణం కలిగినవే వుంటున్నాయన్నారు. 48 గంటల్లోపు ఆయా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







