రూఫ్‌లెస్‌ లైఫ్‌: ఎట్టకేలకు స్వదేశానికి సులేమాన్‌

- April 25, 2019 , by Maagulf
రూఫ్‌లెస్‌ లైఫ్‌: ఎట్టకేలకు స్వదేశానికి సులేమాన్‌

మనామాలోని ఓ భవనం టెర్రాస్‌పై అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్న సులేమాన్‌ అనే భారతీయ వలసదారుడి కష్టాలు తీరుతున్నాయి. అతన్ని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రేపు ఆయన్ని స్వదేశానికి పంపనున్నారు. పదేళ్ళుగా సులేమాన్‌ బహ్రెయిన్‌లో నివసిస్తున్న సంగతి తెల్సిందే. బాధితుడి వెతల్ని తెలుసుకున్న పలు సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్స్‌ అతనికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చాయి. కెఎంసిసి బహ్రెయిన్‌ శాఖ, అతన్ని స్వదేశానికి పంపేందుకు తనవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ట్రావెల్‌ బ్యాన్‌ని రద్దు చేసి, ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ కూడా లభించిందతనికి. కాగా, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న తనకు సహాయ సహకారాలు అందించాలని సులేమాన్‌ కోరుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com