బంగాళాఖాతంలోవాయుగుండం..
- April 26, 2019
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం…. తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్‌కు ఫణి అని నామకరణం చేశారు వాతావరణ అధికారులు. దీని ప్రభావంతో.. రేపట్నుంచి తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. వేటకు వెళ్లిన మత్య్సకారులు.. ఈ నెల 28నాటికి వెనక్కి తిరిగా రావాలని హెచ్చరించారు.
ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకున్న ఉన్న హిందూమహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం వాయువ్యంగా పయనించి తుపాన్‌గా బలపడుతుందంటున్నారు వాతావరణ అధికారులు. ఇది దక్షిణ తమిళనాడు తీరం దిశగా కదులుతుందని.. . దీని ప్రభావంతో… ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ తుఫాన్‌కు ఫణి అని పేరు పెట్టారు. దీని ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 27 నుంచే తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశలోని దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 45 – 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అక్కడక్కడా పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 28 నాటికి వేటకెళ్లిన మత్య్సకారులు వెనక్కి తిరిగి రావాలన్నారు.
ఈ నెల 30న కన్యాకుమారి ప్రాంతంలో తుఫాన్ తీరం దాటే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో.. కన్యాకుమారి తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







