'కిల్లింగ్ వీరప్పన్' వాయిదా..

- January 01, 2016 , by Maagulf
'కిల్లింగ్ వీరప్పన్' వాయిదా..

తెలుగు, హిందీ భాషల్లో తనదైన స్టయిల్ తో సినిమాలు తీస్తూ ఎప్పుడూ వివాదాస్పద విషయాల్లో నలిచే వ్యక్తి దర్శకులు రాంగోపాల్ వర్మ. గత కొంత కాలం నుంచి బాలీవుడ్ వదిలేసి టాలీవుడ్ బాట పట్టాడు. ఇక్కడ కొన్ని సినిమాలు తీశారు కానీ అవి పెద్ద పేరు తీసుకు రాలేదు. తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో ఓ రియలిస్టిక్ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ వచ్చింది.ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రక రకాల విమర్శలు.వివాదాలు చుట్టు ముట్టినప్పటికీ ఈ చిత్రాన్ని జనవరి 1 కానుకగా అందించాలని చూశారు. ఇక వర్మ అభిమానులు.. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ కానుందని ప్రకటించినప్పటికీ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చారు.కొత్త సంవత్సర కానుకగా వర్మ నిమాను చూడాలని ఫిక్స్ అయిపోయిన ప్రేక్షకులకు చివరి నిమిషంలో మరోసారి చేదువార్త వచ్చిపడింది. సెన్సార్ సంబంధిత పనులు పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు వర్మ చివరి నిమిషంలో ప్రకటించారు.కాకపోతే ఈ చిత్రం కన్నడంలో మాత్రం ఈ రోజు రిలీజ్ అవుతుంది..మరి తెలుగు లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com