వేగవంతమైన అభివృద్ధి: కింగ్‌ అబ్దుల్లా పోర్ట్‌కి రెండో స్థానం

- April 30, 2019 , by Maagulf
వేగవంతమైన అభివృద్ధి: కింగ్‌ అబ్దుల్లా పోర్ట్‌కి రెండో స్థానం

జెడ్డా: ప్రపంచ వ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న పోర్ట్స్‌ లిస్ట్‌లో కింగ్‌ అబ్దుల్లా పోర్ట్‌ - కింగ్‌ అబ్దుల్లా ఎకనమిక్‌ (కెఎఇసి)కి రెండో స్థానం దక్కింది. ఆల్ఫాలైనర్‌ ఈ మేరకు గణాంకాల్ని విడుదల చేసింది. 2017లో కింగ్‌ అబ్దుల్లా పోర్ట్‌ ఏడో స్థానం దక్కించుకుంది. సీఈఓ రయాన్‌ కుతుబ్‌ మాట్లాడుతూ, ఏడో స్థానం నుంచి రెండో స్థానంలోకి రావడం ద్వారా కింగ్‌ అబ్దుల్లా పోర్ట్‌ గణనీయమైన అభివృద్ధి సాధించిందనే విషయం అర్థమవుతోందని అన్నారు. మెరిటైమ్‌ డేటా, పోర్ట్‌ క్యాపబిలిటీస్‌, ఫ్యూచర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ షిప్స్‌ అండ్‌ షిప్పింగ్‌ రూట్స్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అనలైజ్‌ చేయడంలో ఆల్ఫాలైనర్‌ ఎంతో పేరుగాంచింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com