నగ్నంగా నడక: మహిళకు రెండేళ్ళ జైలు శిక్ష

- May 01, 2019 , by Maagulf
నగ్నంగా నడక: మహిళకు రెండేళ్ళ జైలు శిక్ష

బహ్రెయిన్: గత ఏడాది నవంబర్‌లో ఓ మహిళ, రోడ్డుపై నగ్నంగా నడిచి వెళ్ళిన ఘటనలో, సదరు మహిళకు న్యాయస్థానం రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ శిక్షను హై అప్పీల్స్‌ కోర్టు తాజాగా సమర్థించింది. ఆ సమయంలో నిందితురాలు డ్రగ్స్‌ మత్తులో వున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు 150 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించారు. కాగా, నిందితురాలి బాయ్‌ఫ్రెండ్‌కి సైతం ఏడాది జైలు శిక్ష, 1,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విదించడం జరిగింది. పైకోర్టులో వీరి అప్పీల్‌ని తిరస్కరించడం జరిగింది. నిందితురాలు రోడ్డుపై నగ్నంగా వెళుతుండగా, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. టుబ్లి వద్ద షేక్‌ సల్మాన్‌ హైవే పై ఈ ఘటన జరిగింది. నిందితురాలు కింగ్‌డమ్‌లోని ఓ రిసార్ట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com