రువీలో ప్రముఖ బేకరీని మూసేసిన మస్కట్ మున్సిపాలిటీ
- January 01, 2016
రువిలోనిఓ ప్రముఖ బేకరీని మస్కట్ మున్సిపాలిటీ అథికారులు మూసివేశారు. ట్విట్టర్లో ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. బేకరీలో ఎలుకలు కన్పించాయనీ, అపరిశుభ్రత, వినియోగదారుల ఆరోగ్యానికి హాని కల్గించే పరిసరాలు ఉండటం ఇవన్నీ బేకరీ మూసివేతకు కారణాలుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఆ బేకరీకి తాను రెగ్యులర్ విజిటర్ననీ బేకరీ మూసివేత తనకు ఆశ్చర్యం కలిగించిందని ఓ వినియోగదారుడు చెప్పాడు. ప్రజారోగ్యం విషయంలో మున్సిపాలిటీ అధికారులు రాజీ పడకుండా, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆహారాన్ని తయారుచేసే దుకాణాలపై. ఇబ్రి మున్సిపాలిటీ గతంలో 42 కమర్షియల్ షాప్స్పై దాడి చేసి, 3000 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాల్ని నాశనం చేశాయి. గ్రోసరీ మార్కెట్స్, బేకరీలపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. మస్కట్ మున్సిపాలిటీ అధికారులు 125 రెస్టారెంట్లపై ఇటీవల దాడులు చేయగా, అందులో 53 రెస్టారెంట్లు నిబంధనల్ని ఉల్లంఘించి అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









