CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- March 07, 2026
యూఏఈ: మిడిలీస్టులో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. అనేక మిడిల్ ఈస్ట్ దేశాలలో 12వ తరగతి విద్యార్థులకు మార్చి 9 నుండి మార్చి 11 వరకు నిర్వంచాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈలలోని విద్యార్థులను ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని CBSE పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత కొత్త పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
మార్చి 10న పరిస్థితిని మళ్ళీ సమీక్షిస్తామని, ఆ తర్వాత మార్చి 12 నుండి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని CBSE అధికారులు తెలిపారు.
విద్యార్థులు తమ పాఠశాలలతో నిరంతరం టచ్ లో ఉండాలని, మరిన్ని అప్డేట్ ల కోసం CBSE అధికారిక ఛానెల్స్ ను ఫాలో కావాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







