ఖసబ్‌ నుంచి బందర్‌ అబ్బాస్‌కి 4 రోజుల స్విమ్మింగ్‌

- May 07, 2019 , by Maagulf
ఖసబ్‌ నుంచి బందర్‌ అబ్బాస్‌కి 4 రోజుల స్విమ్మింగ్‌

మస్కట్‌: ఇరానియన్‌ టీచర్‌ ఒకరు ఒమన్‌లోని ఖసబ్‌ నుంచి ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌కి 120 కిలోమీటర్ల దూరం స్విమ్‌ చేసుకుంటూ వెళ్ళారు. ఇరానియన్‌ క్యాలెండర్‌ గౌరవార్ధం ఈ సాహసం చేపట్టారు 47 ఏళ్ళ ఇరాన్‌ టీచర్‌ మొహమ్మద్‌ అమిరి రూడాన్‌. మే 2న మొదలైన ఈయన ప్రయాణం నాలుగు రోజులపాటు సాగింది. మొత్తం రెండు భాగాలుగా తన ప్రయాణాన్ని డిజైన్‌ చేసుకున్నారాయన. స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్మోజ్‌ ద్వారా ఈ ప్రయాణం సాగింది. ప్రపంచంలో 25 శాతం ఫ్యూయల్‌ సెర్సెస్‌ ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. మొహమ్మద్‌ అమిర్‌ రూడాన్‌ గతంలోనూ లాంగ్‌ డిస్టెన్స్‌ స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ టూర్స్‌ని నిర్వహించారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com