దుబాయ్‌ ఫ్రేమ్స్‌: రమదాన్‌ టైమింగ్స్‌ ఇవే

దుబాయ్‌ ఫ్రేమ్స్‌: రమదాన్‌ టైమింగ్స్‌ ఇవే

దుబాయ్‌లో ప్రముఖ టూరిజం ఎట్రాక్షన్స్‌లో ఒకటైన దుబాయ్‌ ఫ్రేమ్‌, పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా సందర్శన వేళల్ని ప్రకటించింది తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ద్వారా. పవిత్ర రమదాన్‌ మాసంలో సందర్శకులకు వెల్‌కమ్‌ చెబుతున్న దుబాయ్‌ ఫ్రేమ్స్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి వుంటుందని ప్రకటించారు నిర్వాహకులు. 150 మీటర్ల ఎత్తు నుంచి పనోరమిక్‌ వ్యూస్‌ని పాత - కొత్త దుబాయ్‌ అద్భుతాల్ని తిలకించే అవకాశం కల్పిస్తుంది ఈ అపూర్వ కట్టడం. పెద్దలకు 50 దిర్హామ్‌లు, పిల్లలకు 20 దిర్హామ్‌లతో దుబాయ్‌ ఫ్రేమ్‌లోకి ప్రవేశించవచ్చు. 3 ఏళ్ళ లోపు, 65 ఏళ్ళ పైబడినవారికి అలాగే పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌కి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. 

Back to Top