మస్కట్ లో 'తెలుగు కళా సమితి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు

- May 09, 2019 , by Maagulf
మస్కట్ లో 'తెలుగు కళా సమితి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు

ఒమన్:ఒమన్ దేశం లోని మస్కట్ నగరంలో (*భారతీయ సామాజిక సంఘం (Indian Social Club) కు అనుబంధమైన తెలుగు విభాగానికి (Telugu Wing) సంబంధించిన*) తెలుగు కళా సమితి,  మే నెల 3వ తేదీన "శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు" ను కడు రమ్యంగా నిర్వహించింది.
మస్కట్ లో నివసిస్తున్న (*తెలుగు కుటుంబాలే కాకుండా పరిసర పట్టణమైన సోహర్ నుంచి కూడా* )అనేక తెలుగు కుటుంబాలు సుమారు 600 వరకు ఈ ఉగాది వేడుకలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ ఉగాది వేడుకలు లో ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవితా పఠనం, అష్టావధానం వంటి సాంప్రదాయ కార్యక్రమాలు మాత్రమే కాకుండా, శాస్త్రీయ/సాంప్రదాయ నృత్యాలు, బృంద గీతాలు, నాటికలు వంటి అంశాల్లో అనేకమంది చిన్నారులు, పెద్దలు అత్యంత సంబరంతో పాల్గొని ఆహుతులను రంజింప చేశారు.


ముఖ్యంగా ఈ ఉగాది వేడుకల్లో ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, నటుడు, దర్శకులు అయిన యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్య అతిధి గా పాల్గొని నిండైన శోభ తెచ్చారు. ఈ వేడుకల్లో పూర్వ కార్యవర్గ సభ్యులను, ఇతర ప్రతిభావంతులైన వారిని గుర్తించి, ముఖ్య అతిథి యండమూరి వీరేంద్రనాథ్ చే సత్కరించటం జరిగింది.


వేడుకల అనంతరం, తెలుగు వారికి ఇష్టమైన వంటకాలతో నోరూరించే ఉగాది విందు ఏర్పాటు చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com