యూఏఈలో భారత వలసదారులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసిన ఎంబసీ

- May 11, 2019 , by Maagulf
యూఏఈలో భారత వలసదారులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసిన ఎంబసీ

అబుధాబి:యూఏఈలోని ఇండియన్‌ ఎంబసీ, తమ పౌరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. చేసిన పనికి జీతం దక్కని పక్షంలో, ఎంబసీని సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీషుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ ఈ ప్రకటనను విడుదల చేశారు. జీతాలు దక్కని కారణంగా భారతీయ వలసదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ఇలాంటి వారు ఎక్కువగా పలు కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్న అధికారులు, ఎంబసీని సంప్రదిస్తే, తగు న్యాయం జరగడానికి చర్యలు తీసుకుంటామనీ, రిటర్న్‌ టిక్కెట్లు ఇచ్చి స్వదేశానికి పంపడం ద్వారా ఇబ్బందుల్లో వున్నవారి సమస్యలు కొంతవరకు తగ్గుతాయని అంటున్నారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా భారత వలసదారుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com