మద్యం మత్తులో సోదరిపై కాల్పులు జరిపిన కువైటీ
- May 11, 2019
కువైట్: కువైటీ వ్యక్తి ఒకరు మద్యం మత్తులో తన సోదరిపైనే కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన ఆపరేషన్ రూమ్‌కి ఈ సమాచారం అందింది. సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి పారామెడిక్స్, సెక్యూరిటీ సిబ్బంది చేరుకున్నారు. ఆ సమయంలో సంఘటనా స్థలంలో కలష్నికోవ్ గన్‌తో నిందితుడు కన్పించాడు. తన సోదరితో జరిగిన గొడవ కారణంగా తాను ఆమెపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోంది. ఆ పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు వెల్లడించారు. నిందితుడి సోదరుల్ని ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







