రసాబాసగా మారిన 'మా' అసోసియేషన్ మీటింగ్
- May 12, 2019
మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఇటీవలె ఎలక్షన్ జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడునరేశ్ ప్యానల్ ఎన్నికయ్యారు. నరేష్ మా అధ్యక్షుడుగా, జీవితరాజశేఖర్ జనరల్‌సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ రాజీవ్‌కనకాల, జనరల్ సెక్రటరీ శివబాలీజీ తదితరులు ఈ ప్యానల్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొట్ట మొదటి సారి ఈసీ మెంబర్స్ అందరూ కలిసి నిన్న మీటింగ్ పెట్టుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా మా అసోసియేషన్ ఈసీ మెంబర్స్‌కు జనరల్ సెక్రటరీ అయిన జీవిత రాజశేఖర్ క్షమాపణలు కోరారు.
ఇంతకీ ఆమె క్షమాపణలు కోరాల్సినంత అవసరం ఏమొచ్చిందా అనుకుంటున్నారా... మా అసోసియేషన్‌కి సంబంధించిన ఫండ్స్ ప్రతి ఒక్కరూపాయి కేవలం మా మూవీ ఆర్టిస్ట్ సంక్షేమం కోసమే వాడాలి. ఆ డబ్బును వేరేవిధంగా ఉపయోగించ కూడదు. కాని ఆమె ఏదో ఎడ్వర్టైజ్‌మెంట్ కోసమని అక్షరాలా ఏడులక్షల యాభైవేల రూపాయలను వాడారని తెలిసింది. అలా అని అటు ఎడ్వర్టైజ్‌మెంట్ కూడా ఏమీ లేదు. దీన్ని ఈసీ మెంబర్స్ అందరూ కలిసి గట్టిగా నిలదీస్తే వీలైనంత త్వరలో తను ఆ మొత్తాన్ని ఇచ్చేస్తానని అందుకు అందరూ తనను క్షమించాలని కోరారని సమాచారం.
మరి ఇలా అసోసియేషన్ డబ్బులను దుర్వినియోగం చెయ్యడం ఎంత వరకు న్యాయం. ఆమెను ఇండస్ట్రీలో ఒక కీలక వ్యక్తిగా చేసి ఎన్నికచేసుకున్నందుకు ఆమె చేసే న్యాయం ఇదా. ఎన్నో సినిమా ఫంక్షన్లకు అతిధిగా విచ్చేసి ఎన్నో స్పీచ్‌లను జనానికి ఇచ్చే ఆవిడ ఇలా చేసి ఉంటదా లేక ఎక్కడయినా ఏదన్నా పొరపాటు జరిగి ఉంటదా అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలె ఒక సినిమా ట్రైలర్ లాంచ్‌కి గెస్ట్‌గా వెళ్ళి ఆ ట్రైలర్ కాస్త అసభ్యంగా ఉండడంతో స్టేజ్ మీదే డైరెక్టర్‌ని కడిగిపారేసినామె అన్ని విషయాల్లోను కరెక్ట్‌గా ఉండే ఆమె ఇలా చేసి ఉంటదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఈ విషయంలో ఇంకా నిజ నిజాలు తెలియాల్సి ఉంది.
అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణం రాజు దంపతులు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరయ్యారు..వీరితో పాటు 'మా' మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం గమనార్హం.. మా ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు.. ఈ సందర్భంగా 'మా' కోసం కంపోజ్ చేయించిన ప్రత్యేక గీతాన్ని సూపర్ స్టార్ కృష్ణ అయన సతీమణి నిర్మల చేతులమీదుగా విడుదల చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







