పదోతరగతి పాసైతే ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు..
- May 15, 2019ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జూన్ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూన్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు.. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) 10వ ఎంట్రీ- 02/2019 బ్యాచ్ పోస్టులు: కుక్, స్టీవార్డ్
అర్హత: 50 శాతం మార్కులతో పదవతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్ అభ్యర్థులు, కోస్ట్ గార్డ్ యూనిఫామ్ ఉద్యోగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.10.2019 నాటికి 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.10.1997 – 30.09.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా జీతభత్యాలు: ప్రారంభంలో బేసిక్ పే స్కేలు కింద నెలకు రూ.21,700 ఇస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ప్రమోషన్ సమయంలో ప్రధాన అధికారి హోదాలో నెలకు రూ.47,600 ఇస్తారు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 05.06.2019 ఆన్లైన్ దరఖాస్తు చివరితేదీ : 10.06.2019 హాల్‌టికెట్ల డౌన్లోడ్: జూన్ 20 నుంచి 26 వరకు పరీక్ష నిర్వహణ: జూన్/జులై 2019 ఫలితాల వెల్లడి: సెప్టెంబరు 2019 శిక్షణ ప్రారంభం: అక్టోబరు 2019
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం