అతి పెద్ద మాస్క్‌ని ప్రారంభించిన షార్జా రూలర్‌

అతి పెద్ద మాస్క్‌ని ప్రారంభించిన షార్జా రూలర్‌

షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ డాక్టర్‌ సుల్తాన్‌ బిన్‌ ముహమ్మద్‌ అల్‌ కాసిమి, ఎమిరేట్స్‌లోనే అతి పెద్ద మాస్క్‌ని ప్రారంభించారు. 300 మిలియన్‌ దిర్హామ్‌ల ఖర్చుతో షార్జా మాస్క్‌ని మీహా మరియు ఎమిరేట్స్‌ రోడ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద నిర్మితమైంది. 25,00 మందికి పైగా వర్షిపర్స్‌కి అకామడేట్‌ చేసేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. 2014లో నిర్మాణం ప్రారంభమయ్యింది. 2 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్‌లో మొత్తం మాస్క్‌ ప్రాంగణాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా నాన్‌ ముస్లిం విజిటర్స్‌ కూడా తిరిగేందుకు వీలుగా కొన్ని ఏర్పాట్లు చేశారు. 2,200 కార్లు, బస్‌లు పార్క్‌ చేయడానికి వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. రబ్బర్‌ వాక్‌ ట్రాక్‌ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. సావనీర్‌ షాప్‌, మ్యూజియం, ఫౌంటెయిన్స్‌ కూడా వున్నాయిక్కడ.  

 

Back to Top