మక్కా, జెడ్డాపై మిస్సైల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- May 22, 2019
యెమెన్‌కి చెందిన తీవ్రవాదులు సౌదీ అరేబియాలోని మక్కా మరియు జెడ్డాపై దాడి కోసం మిస్సైల్స్ ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫారిన్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని సమర్థించకూడదని, ప్రపంచమంతా ఏకమై తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వుందని బహ్రెయిన్ పేర్కొంది. అత్యంత చాకచక్యంగా మిస్సైల్స్‌ని డిస్ట్రాయ్ చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్‌ని ఈ సందర్భంగా బహ్రెయిన్ అభినందించింది. సౌదీ అరేబియాకి బహ్రెయిన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనీ, ఇస్లామిక్ సమాజం అంతా ఈ విషయమై ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. తైఫ్ మీదుగా వస్తున్న మిస్సైల్స్‌ని సౌదీ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. మిస్సైల్ శకలాలు వాడి జలీల్‌లో కూలిపోయాయి. కాగా, యెమనీ ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని ఖండించింది. పవిత్ర నగరాలపై దాడులకు దిగడం ద్వారా తీవ్రవాదులు తమ హీనత్వాన్ని చాటుకున్నారని యెమెన్ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







