ఈనెల 30న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం

ఈనెల 30న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం

ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం దిశగా దూసుకెళుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఎల్లుండి వైసీపీ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. అలాగే ఈనెల 30న జగన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ స్పష్టమైన మెజారిటీ దిశగా వెళుతున్నట్టు కనిపించడంతో తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొంది. ఫలితాలు చూస్తున్న జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేశారు. దీంతో స్వామిజి జగన్ ను అభినందనించారు. ఫలితాలపై ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు జగన్.

Back to Top