మోదీ నివాసంలో బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశం

మోదీ నివాసంలో బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశం

ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తిరుగులేని మెజారిటీతో సొంతంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్‌ ఫలితాల సరళి చాటుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్‌ ట్రెండ్స్‌ను బట్టి ఎన్డీయే 321 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీలు 111 స్థానాలతో రెండో స్థానంలో ఉన్నాయి.

Back to Top