తెలంగాణా ముఖ్యమంత్రి కి సాదర స్వాగతం
- May 26, 2019
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం ఆదివారం సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కి సాదరస్వాగతం లభించింది.
టిటిడి జెఇఓలు లక్ష్మి కాంతం,శ్రీనివాసరాజు,జెసి పి.ఎస్.గిరీషా, తిరుపతి నగర పాలక కమిషనర్ వి.విజయ్ రామరాజు, తిరుపతి సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి అన్బు రాజన్ ,తహశీల్దార్ హరికుమార్, రేణిగుంట డీఎస్ పి చంద్రశేఖర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, టర్మినల్ మేనేజర్ లు గోపాల్, శ్యామ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప, శాసనభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయనస్వామి, ఆదిమూలం, నవాజ్ బాషా , రాజకీయ నాయకులు ఎం.ఆర్.సి.రెడ్డి, శంకర్ రెడ్డి,అభినయ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, కార్యకర్తలు స్వాగతం పలికిన వారిలోవున్నారు.
విమానాశ్రయంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారి ఎం.కె.సింగ్, సిఐ ఎస్ ఎఫ్ అడిషనల్ కమాండెంట్ శుక్లా, రెవెన్యూ అధికారులు ఈశ్వర్ ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు తిరుమల బయలుదేరి వెళ్లారు. రాత్రి బస చేసి సోమవారం ఉదయం శ్రీవారి ని దర్శించుకుని మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగుప్రయానం అవుతారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







