గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం
- May 31, 2019
ఎంత పనిచేసినా జీతం ఎక్కువ ఇవ్వట్లేదని బాధపడే వాళ్లను చూస్తాం. వేతన సవరణ కోసం ఉద్యమాలు, ఆందోళనలు సర్వసాధారణం. కంపెనీ ఏదైనా ఉద్యోగుల్లో నిరంతరం అసంతృప్తి కలిగించేది ఏదైనా ఉందంటే జీతమే. ఏటేటా ఇంక్రిమెంట్ ఉన్నా.. ఏదో వెలితి ఉంటుంది. కానీ తాను చేస్తున్న పనికి ఇప్పటికే ఎక్కువ జీతం వస్తోంది అదనంగా ఇంక అవసరం లేదు అనే వాళ్లను చూశారా? గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అదే పని చేశారు.
ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ కు మన భారతీయుడు సుందర్ పిచాయ్ సీఈవోగా ఉన్నారు. ఆయన ప్రతిభను మెచ్చి గూగుల్ కంపెనీ రూ.405 కోట్లను ఆయనకు ఇన్సెంటీవ్ గా ఇచ్చింది. అయితే ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. తనకు ఇప్పటికే వేతనం రూపంలో కంపెనీ ఎక్కువగా ఇస్తోందని, అదనపు డబ్బు అవసరం లేదన్నారట. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ సీఈవోల్లో సుందర్ పిచాయ్ ఒకరు. ఆయనకు ఏడాదికి దాదాపు రూ.13వందల కోట్లు జీతం వస్తోంది. ఆయన జీతాన్ని గూగుల్ కంపెనీ ఈ ఏడాది మళ్లీ సవరించనుంది. దీంతో పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







