కాబూల్ లో కారు బాంబు పేలుడు..
- May 31, 2019
కాబూల్:కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాబూల్ జిల్లాలోని పుల్-ఎ-చఖ్రీ రోడ్డుపై ఈ పేలుడు సంభవించింది. భద్రతాదళాల కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన పేలుడులో నలుగురు చనిపోగా..యూఎస్ సర్వీస్ మెన్ తోపాటు మరికొంతమంది గాయపడ్డారని అప్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నశ్రత్ రహిమి తెలిపారు. ఉదయం 8:30 గంటలకు ఖాలా-ఇ-వజీర్ ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగిందన్నారు. అయితే ఈ దాడులు ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే పశ్చిమ కాబూల్ లోని మిలటరీ అకాడమీకి సమీపంలో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







