700 మంది కార్మికులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసిన షార్జా చర్చ్‌

- May 31, 2019 , by Maagulf
700 మంది కార్మికులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసిన షార్జా చర్చ్‌

 షార్జా:చర్చిలో పెళ్ళిళ్ళు జరగడం మామూలే. కానీ, ఓ చర్చి ముస్లిం సమాజానికి సంబంధించిన ఈవెంట్‌ని నిర్వహించడం సాధారణ విషయమైతే కాదు. షార్జాలోని సెంట్‌ మైఖేల్‌ చర్చ్‌ 700 మంది బ్లూ కాలర్డ్‌ వర్కర్స్‌కి ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు చెందిన 30 కేథలిక్‌ వాలంటీర్స్‌ ఈ ఇఫ్తార్‌ విందుకు సహాయ సహకారాలు అందించారు. 1971లో ఈ చర్‌చ ఏర్పాటయ్యింది. 'ఇయర్‌ ఆఫ్‌ మెర్సీ'గా ఈ ఏడాదిని పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటించిన దరిమిలా, ఈ ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏడు పెద్ద టేబుల్స్‌ లైన్స్‌లో కూర్చున్న కార్మికులు, డేట్స్‌, వాటర్‌, బిర్యానీతో తమ ఫాస్టింగ్‌ని ముగించారు. ఆకలికి మతంతో సంబంధం లేదనీ, ప్రేమాభిమానాల విషయంలో మతాల మధ్య తేడాలకు తావు లేదని పరస్పర సహకరమే మానవ జాతికి ఔన్నత్యం కలిగిస్తుందని ఈ సందర్భంగా కార్మికులు, నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com