కొలన్ క్యాన్సర్‌ని ముందే గుర్తించడం ఎలా!
- June 11, 2019
బహ్రెయిన్:కొలన్ క్యాన్సర్‌ని ముందే గుర్తించడానికి సంబంధించి ఈ వారంలో సరికొత్త కార్యాచరణను ప్రకటించనున్నారు. కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే నేషనల్ కమిటీ ఫర్ కంట్రోల్ క్రానిక్ నాన్ కమ్యూఇనకబుల్ డిసీజెస్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో కొలన్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దరిమిలా, ఈ ఇనీషియేటివ్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. 'టువార్డ్స్ క్యూరబులిటీ' పేరుతో ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభిస్తారు. 45 నుంచి 75 ఏళ్ళ వయసువారిని ఈ క్యాంపెయిన్‌లో టార్గెట్ చేసుకోనున్నారు. ముందస్తుగా కొలన్ క్యాన్సర్‌ని గుర్తించగలిగితే, త్వరగా, తేలికగా నయం చేయవచ్చునని వైద్యులు అంటున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కష్టమవుతుందనీ, ఆర్థికంగానూ అది మోయలేని భారం అవుతుందనీ కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ హెడ్ అలాగే కన్సల్టెంట్ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజెస్ డాక్టర్ ఒమర్ షరీఫ్ చెప్పారు. ఈ క్యాంపెయిన్ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వివరించారాయన.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







