'మోదీ హై తో'...అంటూ మోడీ గురించి ప్రసంగించిన అమెరికా విదేశాంగ మంత్రి
- June 13, 2019
భారత ప్రధాని మోదీని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రశంసలతో ముంచెత్తారు. ' మోదీ హై తో ముమ్ కిన్ హై ' (మోదీ ఉంటే సాధ్యం కానిదేదీ లేదు) అంటూ ఆయన హిందీలో చమత్కరించారు. (ఇది పాపులర్ స్లోగన్ కూడా). భారత, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడడానికి తాను కృషి చేస్తానని చెబుతూనే మైక్.. మోదీ ఉండగా ఇక ' భయమెందుకు ' అన్న ధోరణిలో మాట్లాడారు. ఈ మైత్రీ సంబంధాల పటిష్టతకు ట్రంప్, మోదీ ప్రభుత్వాలకు చక్కని అవకాశం లభించిందని ఆయన చెప్పారు. తన ఇటీవలి ఎన్నికల ప్రచారంలో మోదీ.. తనకు తాను ఛలోక్తిగా చేసిన ఈ నినాదాన్ని మైక్ గుర్తు చేశారు. బుధవారం వాషింగ్టన్ లో యు-ఎస్ -ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమ్మిట్ లో ప్రసంగించిన ఆయన..తను త్వరలో ఢిల్లీని విజిట్ చేసి మోదీ తోను, భారత విదేశాంగ మంత్రి ఎస్,జైశంకర్ తోను భేటీ అవుతానని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఓ కొత్త స్థాయికి తీసుకువెళ్లేలా తన వద్ద ప్రధాన ప్రతిపాదనలున్నాయని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రెండు దేశాల ప్రజలు మరింత సన్నిహితం కావాలన్నదే తన ఆకాంక్ష అని మైక్ అన్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు ఈయన ఇండియాతో బాటు శ్రీలంక, జపాన్, దక్షిణ కొరియా దేశాలను సందర్శించనున్నారు. పాకిస్థాన్ టెర్రరిజానికి ఊతమిస్తున్న నేపథ్యంలో తమ దేశ అధ్యక్షుడు ట్రంప్..
ఆ దేశం పట్ల కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని మైక్ గుర్తు చేశారు. ఇండియాకు తమ దేశ కంపెనీలు ఇప్పటికే పలు హై టెక్నాలజీ పరికరాలను, సాధనాలను పంపామని, వీటిలో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టం వంటివి ఉన్నాయని ఆయన వివరించారు. భారత్ తన ఇంధన సెక్యూరిటీ అవసరాలను తీర్చుకునేందుకు అమెరికా ఇదివరకే ఆసియా-ఎడ్జ్ ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది.. ఇంకా మేము చేయాల్సింది ఎంతో ఉంది అన్నారాయన. లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్-21, బోయింగ్ ఫైటర్స్ వంటివాటిని ఇండియాకు అందజేయనున్నట్టు మైక్ తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..