మోడీ అడుగుజాడల్లో పాక్ ప్రధాని
- June 13, 2019
ఇస్లామాబాద్: అక్రమాలు, అవినీతికి పాల్పడే వారిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొరడా ఝుళపించనున్నారు. అలాంటివాళ్ల వల్ల దేశానికి అపార నష్టం వాటిల్లడమే కాకుండా ,దేశంలోని ప్రజలు పేదరికంలోకి వెళ్లాల్సి వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు దశాబ్ద కాలంలో రూ 24 లక్షల కోట్ల విలువైన రుణాలు ఎలా తీసుకున్నాయో.. తద్వారా దేశం ఎలా దివాళా తీసిందో తేల్చేందుకు తన సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమీషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రజాస్వామ్యం మాటున ఆశ్రయం కోరే ఇలాంటి శక్తులకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించబోమని ఇమ్రాన్ స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్ ప్రతిపక్ష నేత హజ్మా షాహబాజ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తదితరుల అరెస్టు నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







