సమ్మిట్ లో మాట్లాడుకోని మోడీ, ఇమ్రాన్ ఖాన్
- June 14, 2019



కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి 14 వరకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా మోడీ ఇదే వేదికగా పావులు కదపనున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొలిరోజు సమావేశంలో ఆయా దేశాల నేతలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. చైనా,రష్యా,సహా పలుదేశాల అధినేతలతో మోడీ మాటలు కలిపారు గానీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాత్రం మాట్లాడలేదు.
గురువారం(జూన్-13,2019)బిష్కెక్ లో సమ్మిట్ కు హాజరైన నాయకులందరికీ కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరన్ బే జీన్ బెకోవ్ విందు ఏర్పాటు చేశారు. ఇక్కడ మోడీ, ఇమ్రాన్ ఖాన్ కలిసి కూర్చోలేదని సమాచారం. అంతేకాదు విందు సమయంలోనూ ఇద్దరు ప్రధానులు కుశల ప్రశ్నలు వేసుకోలేదని సమాచారం. దీంతో వీరిద్దరి గురించి అక్కడి నేతల మధ్య చర్చ కూడా వచ్చింది. ఎస్‌సీవో వేదికగా మోడీ అన్ని దేశాల నేతలతో సమావేశమవనున్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్‌తో మాత్రం భేటీ లేనట్లేనని తెలుస్తోంది. ఎస్‌సీవో సదస్సు ప్రారంభానికి ముందు కలిసి చర్చించుకుందామని పాక్ ప్రధాని ఇమ్రాన్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇద్దరూ భారత్‌కు విడివిడిగా లేఖలు రాసిన విషయం తెలిసిందే.
దేశ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేసిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ పట్ల భారత్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది.పాక్ తో ఇక మాటల్లేవ్ అని ప్రధాని మోడీ గతంలో పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మరోసారి పాకిస్థాన్‌కు మోదీ వార్నింగ్ ఇచ్చారు. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని అదుపు చేయాలన్నారు. కిర్గిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సమ్మిట్‌లో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే మోదీ తన హెచ్చరికలు కొనసాగించారు. అయితే మోదీ ఎక్కడా తన ప్రసంగంలో పాకిస్థాన్ పేరును ప్రస్తావించలేదు. భారత్‌ను నిర్వీర్యం చేసేందుకు ఓ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఇలా గత కొన్నేళ్లుగా జరుగుతోందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి దేశం ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న, మద్దతు ఇస్తున్న దేశాలనే బాధ్యుల్ని చేయాలని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







