రాష్ట్రీయ ఇసాయి మంచ్
- January 04, 2016
క్రైస్తవులకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఒక సంస్థను ప్రారంభించనున్నది. రాష్ట్రీయ ఇసాయి మంచ్ పేరిట ప్రారంభం కానున్న ఈ సంస్థ ద్వారా క్రైస్తవులకు చేరువ కావాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తోంది. ఆరెస్సెస్ ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ఇప్పటికే ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ను ప్రారంభించింది. అవే మార్గదర్శకాలతో క్రైస్తవ రాష్ట్రీయ మంచ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. ముస్లిం రాష్ట్రీయ మంచ్‌కు రూపకల్పన చేసిన ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. నలుగురైదుగురు ఆర్చ్‌బిషప్‌లు, సుమారు 40 నుంచి 50 మంది రివరెండ్ బిషప్‌లతో సమావేశాలు నిర్వహించామని, తద్వారా సంస్థ ఏర్పాటుకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించామని ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







