423 కిలోల డ్రగ్స్ సీజ్: 12 మంది వలసదారుల అరెస్ట్
- June 19, 2019
అబుధాబి పోలీసులు 423 కిలోల హెరియాన్ అలాగే క్రిస్టల్ మెత్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద డ్రగ్స్ హాల్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో 12 మంది ఆసియా జాతీయుల్ని కూడా అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వెహికల్లో రహస్య ప్రాంతంలో వుంచి డ్రగ్స్‌ని నిందితులు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 500,000 కాప్టగాన్ ట్యాబ్లెట్స్ కూడా ఈ సందర్భంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్ది నెలలుగా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామనీ, ఈ డ్రగ్స్ సీజ్‌తో తమ ప్రయత్నం విజయవంతమయ్యిందని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ తహెర్ ఘారిబ్ అల్ దాహిరి చెప్పారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!