ఇమ్రాన్ కు తేల్చి చెప్పేసిన మోడీ
- June 20, 2019
న్యూఢిల్లీ : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పొరుగుదేశం నిర్ధష్ట చర్యలు చేపడితేనే పాకిస్తాన్‌తో సంబంధాలు బలపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖకు బదులిస్తూ ప్రధాని మోదీ భారత్ వైఖరిని తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌తో చర్చలకు ముందు ఉగ్రవాద దాడులు లేని పరస్పర విశ్వాసంతో కూడిన ప్రశాంత వాతావరణం అవసరమని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చినందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖకు ప్రధాని స్పందిస్తూ ఇమ్రాన్‌కు లేఖ రాశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. కశ్మీర సహా అన్ని సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలకు చొరవ చూపాలని ఈ లేఖలో ఇమ్రాన్ ఖాన్ సూచించారు.
మరోవైపు ఉగ్రవాదం, హింసోన్మాదం లేని శాంతియత వాతావరణం నెలకొంటేనే పాకిస్తాన్‌తో చర్చలు సాధ్యమవుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. పాక్‌తో సహా పొరుగు దేశాలతో శాంతియుత, స్నేహపుర్వక సంబంధాలను భారత్ ఆకాంక్షిస్తోందని పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







