టీటీడీ పాలకమండలి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి నియామకం
- June 21, 2019
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమిస్తూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఉదయం సంతకం చేశారు. ఆయన నియామకపు ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితం వెలువడ్డాయి. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు వైవీకి కీలక పదవిని ఇస్తూ, జగన్ పత్రాలపై సంతకం చేశారు. ఆ వెంటనే నియమకపు ఉత్తర్వులు టీడీపీ ఈఓ అనిల్ సింఘాల్ కు అధికారులు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆ పదవిలో కొనసాగుతున్న టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్, రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, రేపు ఉదయం 11 గంటలకు శ్రీవారి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







