నాన్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాల్లో వాహనాల్ని విక్రయిస్తే 100 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

నాన్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాల్లో వాహనాల్ని విక్రయిస్తే 100 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

మస్కట్‌: వాడిన కార్లను విక్రయించేందుకు కేవలం సోహార్‌లోని ఇండస్ట్రియల్‌ ఏరియాస్‌లో మాత్రమే అనుమతి వుంది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే 100 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా తప్పదు. ఈ మేరకు మినిస్టర్‌ ఆఫ్‌ రాయల్‌ కోర్ట్‌ స్పష్టమైన లోకల్‌ ఆర్డర్‌ జారీ చేసి వున్నారు. దివాన్‌ ఆఫ్‌ రాయల్‌ కోర్ట్‌ మినిస్టర్‌ సయ్యిద్‌ ఖాలిద్‌ బిన్‌ హిలాల్‌ అల్‌ బుసైది 2019/1 లోకల్‌ ఆర్డర్‌ని ఈ మేరకు జారీ చేశారు. విలాయత్‌ ఆఫ్‌ సోహార్‌లో కార్లను అమ్మేందుకు వీలుగా ఓ ప్రాంతాన్ని కేటాయిస్తూ ఈ ఆర్డర్‌ని జారీ చేశారు. ఆర్టికల్‌ 1 ప్రకారం ఇండస్ట్రియల్‌ జోన్స్‌లో మాత్రమే యూజ్డ్‌ కార్లను విక్రయించాలి. నాన్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాస్‌లో విక్రయించే కార్లకు 100 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధిస్తారు. 

 

Back to Top